DEGREE : డిగ్రీలో సబ్జెక్టుగా సైబర్ సెక్యూరిటీ

హైదరాబాద్ (సెప్టెంబర్ – 11) : తెలంగాణలో డిగ్రీ విద్యార్థులు ఇకనుంచి ఖచ్చితంగా తప్పనిసరి సబ్జెక్టుగా సైబర్ సెక్యూరిటీ (cyber security is compulsory subjects in degree) 4 క్రెడిట్స్ అదనంగా చదవాల్సి ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల మదింపునకు పరీక్షల నిర్వహణ విధానాన్ని, ప్రశ్నాపత్రాల మూల్యాంకనాన్ని కొత్త విధానంలో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

డిగ్రీ డిగ్రీ చదివే ప్రతి విద్యార్థి వాల్యూ అడిషన్ లో భాగంగా సైబర్ సెక్యూరిటీ కోర్సును నాలుగు క్రెడిట్ లుగా చదవాల్సి ఉంటుంది ప్రధాన కోర్సులతో పాటు దీన్ని అదనంగా చదవాలి. నాలుగో సెమిస్టర్ లో దీనిని చదవాల్సిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కళాశాలలో దీనిని అమలు చేయనున్నారు.