1) ఏషియన్ స్వాష్ టీమ్ ఛాంపియన్స్ షిప్ 2022 టీమ్ ఈవెంట్ లో భారత్ ఏ పథకం దక్కించుకుంది.?
జ : బంగారు పథకం (మొదటిసారి)
2) టాటా అడ్వాన్స్‌డ్ సిస్టం ఏ కంపెనితో విమాన ఇంజిన్ల పరికరాల తయారికై ఒక బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని పొడిగించింది.?
జ : జీఈ ఏరోస్పేస్
3) నేషనల్ ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ 2022 ఎక్కడ నిర్వహించారు.?
జ : రాయిపూర్ (చత్తీస్‌ఘఢ్)
4) అరుణాచల్ ప్రదేశ్ లోని హొలింగి ఏయిర్‌పోర్ట్ పేరు బదులు కేంద్రం ఏ పేరును పెట్టింది.?
జ : దోన్హీ పోలో ఏయిర్‌పోర్ట్
5) స్పేస్ ఎక్స్ ఇటీవల ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన రాకెట్ పేరు ఏమిటి.?
జ : ఫాల్కన్ హెవీ
6) యూజీసీ ఎప్పుడు భారతీయ భాష దినోత్సవం జరుపుకోవాలని సూచించింది.?
జ : డిసెంబర్ – 11 (తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి జయంతి)
7) భారత్ లోమొట్టమొదటి “సమీకృత ఆక్వా పార్క్” ని ఎక్కడ ప్రారంభించింది.?
జ : జైరో (అరుణాచల్ ప్రదేశ్)
8) ఇటీవల 53వ టైగర్ రిజర్వ్ గా రాణీపూర్ టైగర్ రిజర్వ్ ని కేంద్రం గుర్తించింది. ఇది ఏ రాష్ట్రంలో కలదు.?
జ : ఉత్తరప్రదేశ్
9) అక్టోబర్ మాసంలో జీఎస్టీ వసూలు ఎంత.?
జ : 1.51 లక్షల కోట్లు
10) సైక్లింగ్ లో ట్రాక్ ఆసియా కప్ 2022 ను ఏ రాష్ట్రం ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : కేరళ