CURRENT AFFAIRS IN TELUGU 13th MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 13th MARCH 2023

1) చైనా దేశపు నూతన రక్షణ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : లీ షెంగ్ పూ

2) డెన్మార్క్ దేశం ప్రారంభించనున్న ప్రాజెక్ట్ గ్రీన్ స్టాండ్ లక్ష్యం ఏమిటి.?
జ : కార్బన్ డయాక్సైడ్ ను సముద్ర భూతలంలో పాతి పెట్టడం

3) ఆర్థిక, పారిశ్రామిక, ప్రజారోగ్యం, సైబర్ సెక్యూరిటీ విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది.?
జ : వన్97 (పేటీయం మాతృ సంస్థ)

4) ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ టెక్సాస్ సమీపంలో నిర్మిస్తున్న నూతన నగరం పేరు ఏమిటి.?
జ : స్నెయిల్ బ్రూక్

5) ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రపంచంలోనే పొడవైన రైల్వే ఫ్లాట్ ఫామ్ జాతికి అంకితం చేశారు. ఆ ఫ్లాట్ ఫామ్ ఏది.?
జ : శ్రీ సిద్దరూడ స్వామీజీ హుబ్బళ్ళి రైల్వే స్టేషన్

6) ఫిబ్రవరి 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 6.4%

7) ఫిబ్రవరి 2023లో ఆహార పదార్థాల ద్రవయోల్బణం ఎంత శాతంగా నమోదయింది.?
జ : 5.95%

8) స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) నివేదిక ప్రకారం ప్రపంచంలో పెద్ద ఆయుధ దిగుమతిదారు ఎవరు.?
జ : భారత్

9) సిప్రి నివేదిక ప్రకారం ఆయుధ అతిపెద్ద ఎగుమతి దారు ఎవరు?
జ : అమెరికా

10) సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కుల కేసు విచారణ కొరకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ధర్మాసనం ఏర్పాటు చేయాలని తీర్పు ఇచ్చింది.?
జ : ఆర్టికల్ 145 (3)

11) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 విజేత ఎవరు.?
జ : భారత్ (2-1) తేడాతో

12) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో మేన్ అఫ్ ది సిరీస్ గా ఎవరు నిలిచారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్ & రవీంద్ర జడేజా

13) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 కు అర్హత సాధించిన జట్లు ఏవి.?
జ : భారత్ – ఆస్ట్రేలియా

14) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) దేశాల ప్రధాన న్యాయమూర్తుల సదస్సు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో మార్చి 10, 11 వ తేదీలలో ఎక్కడ నిర్వహించారు.?
జ : న్యూ ఢిల్లీ

15)ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు కనిపెట్టిన యాంటీ బ్యాక్టీరియల్ కణం పేరు ఏమిటి.?
జ : IITR00693

16) భారత్ రైల్వే ఏ గేజ్ మార్గాన్ని 100% ఎలక్ట్రిక్ గేజ్ గా మార్చింది.?
జ : బ్రాడ్ గేజ్