CURRENT AFFAIRS IN TELUGU 10th MARCH 2023

1) శుక్రకణాలను అండంగా మార్చి.. ఆ అండాన్ని మరో శుక్రకణంతో ఫలదీకరణం చెందించిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు.?
జ : జపాన్

2) సెమీ కండక్టర్ల పంపిణీ కోసం ఇటీవల భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : అమెరికా

3) జనవరి మాసానికి గాను భారత దేశ పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు ఎంత.?
జ : 5.2%

4) భారత్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తమ నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామకాలలో మాజీ అగ్ని వీరులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : 10%

5) బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నుంచి ‘ మహిళా పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డు గెలుచుకున్నది ఎవరు.?
జ : మనీషా రామ్‌దాస్ (భారత్)

6) H3N2 వైరస్ తో భారత్ లో ఏ రాష్ట్రాల్లో తొలి మరణాలు సంభవించాయి.?
జ : కర్ణాటక, హర్యానా

7) కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 12

8) చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికైనది ఎవరు.?
జ : జిన్‌పింగ్

9) హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీ నూతన సీఈఓ మరియు ఎండిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రోహిత్ జావా

10) ఐటీ చట్టం 2000 కి బదులు ఏ చట్టాన్ని తేవడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది.?
జ : డిజిటల్ ఇండియా యాక్ట్

11) ఆస్ట్రేలియా కు చెందిన ఏ క్రికెటర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లు ప్రకటించాడు.?
జ : షాన్ మార్స్

12) ఏ రెండు దేశాలు శతృత్వాన్ని వీడి సహకరించుకోవాలని… అలాగే తిరిగి ఇరుదేశాలలో రాయబార కార్యాలయాలను ప్రారంభించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
జ : ఇరాన్ – సౌదీ అరేబియా

13) మార్చి 20 21వ తేదీలలో భారత్ ను సందర్శించనున్న జపాన్ ప్రధాని ఎవరు.?
జ : కిషిడా పుమియో

14) జర్మనీ లో జరిగిన అంతర్జాతీయ గోల్డెన్ సిటీ గేట్ టూరిజం అవార్డ్స్ 2023లో భారత్ కు ఏ రేటింగ్ దక్కింది.?
జ : గోల్డెన్ & సిల్వర్ స్టార్