BIKKI NEWS (JAN. 25) : దేశంలో ఉన్న ప్రసిద్ధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఒకే పరీక్షతో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకు పోటీ పడే అవకాశం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (CUET PG 2025 NOTIFICATION)తో దక్కుతుంది. వీటిలో కేంద్రీయ విశ్వ విద్యాలయాలతో పాటు కేంద్ర ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యా సంస్థలు సైతం ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది.
కోర్సులు : ఎంఏ, ఎంఎస్సీ, ఎంఎఫ్ఎ, ఎంపీఏ, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ ఒకేషనల్, ఎంఎడ్, ఎంఎఎస్సీ, ఎంపీఈడీ, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంకాం తదితరాలు.
విద్యార్హతలు : ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సీయూఈటీ రాసుకోవచ్చు. పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మిగిలిన వాటికి డిగ్రీలో సంబంధిత కోర్సు చదివినవారై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులకు వయోపరిమితి లేదు.
ఆన్లైన్ పరీక్ష: పరీక్ష కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు.
పరీక్ష విధానం : మొత్తం 75 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి ఒక గంట 45 నిమిషాలు. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో (లాంగ్వేజ్, ఎంటెక్ హయ్యర్ సైన్సెస్, ఆచార్య పేపర్లు తప్ప) ఉంటాయి. ఇందులో 75 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు.
దరఖాస్తు ఫీజు: రెండు టెస్ట్ పేపర్ల వరకు జనరల్ అభ్యర్థులకు రూ.1200/-. ఓబీసీ ఎన్సీఎల్/జనరల్- ఈడబ్ల్యూఎస్ కు రూ.1000/- ఎస్సీ/ఎస్టీ/ థర్డ్ జెండర్లకు రూ.900/-, దివ్యాంగులైతే రూ.800/-, అదనపు టెస్ట్ పేపర్లు (ప్రతి పేపర్) జనరల్ అభ్యర్థులకు రూ.600/- చెల్లించాలి. మిగిలినవాళ్లకు రూ.500./- చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు గడువు : ఫిబ్రవరి 01 -2025
ఫీజు చెల్లింపు గడువు : ఫిబ్రవరి 02 -2025
దరఖాస్తు ఎడిట్ అవకాశం – ఫిబ్రవరి 03 నుంచి 05 -2025
పరీక్ష తేదీలు : మార్చి 13 నుంచి 31 -2025 వరకు.
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్