KVS JOBS – కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలిలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (FEB. 21) : హైదరాబాద్ లోని గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయంలో 2024 – 25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు పద్దతిలో పోస్టుల భర్తీ (contract jobs in kvs gachibowli) కోసం ప్రకటన విడుదల చేశారు.

ఈ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 24న ఇంటర్వ్యూ కు హజరుకావచ్చు.

ఖాళీల వివరాలు

టీజీటీ, ప్రైమరీ టీచర్స్(పీఆర్టీ), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్, స్పేషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్, డాన్స్ కోచ్, ఆర్ట్ కోచ్, డాక్టర్.

అర్హతలు : సంబంధిత పోస్టును అనుసరించి పది, ఇంటర్, డిగ్రీ, బీఎడ్, డీఎడ్, పీజీ, ఎంబీబీఎస్, సీటెట్ ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ : ఫిబ్రవరి 24 – 2024.

చిరునామా : కేంద్రీయ విద్యాలయం – గచ్చిబౌలి, హైదరాబాద్

వెబ్సైట్ : https://gachibawli.kvs.ac.in/