JOBS : బీసీ గురుకులాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు

హైదరాబాద్ (ఆగస్టు 31) : హైదరాబాద్ జిల్లాలోని;మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలు, జూనియర్ కళాశాలలో తాత్కాలిక పద్ధతిలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకాల (contract faculty jobs in telangana bc gurukula schools and colleges 2023) కోసం ప్రకటన వెలువడింది.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆదిత్య వర్మ తెలిపారు.

హిందీ, ఇంగ్లిష్, గణితం, సామాన్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, కామర్స్, కెమిస్ట్రీ, సివిక్స్, హిస్టరీ సబ్జెక్టులలో బోధించుటకు పీజీతో పాటు బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అని వివరించారు.

డెమో, ఇంటర్వ్యూలను సెప్టెంబర్ 4న హైదరాబాద్ మన్సూరాబాద్ లోని సహారా ఎస్టేట్ లో ఉన్న బీసీ గురుకుల పాఠశాలలో ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం
4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వెబ్సైట్ : https://mjptbcwreis.telangana.gov.in/