DSC 2023 : బీటెక్ అభ్యర్థులు టీచర్ పోస్టులకు అర్హులే

హైదరాబాద్ (అక్టోబర్ – 12) : బీఈడీ పూర్తి చేసిన బీటెక్ విద్యార్థులు ఇక నుంచి ఉపాధ్యాయ కొలువులకూ పోటీపడొచ్చంటూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ (Btech candidates eligible for teacher jobs) చేశారు. . తాజాగా వెలువడిన డీఎస్సీ నోటిఫికేషన్ 2023 వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీటెక్ విద్యార్థులకు 2015 సంవత్సరం నుంచే బీఈడీలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా వందల మంది బీటెక్ విద్యార్థులు బీఈడీ కోర్సులో ప్రవేశం పొందుతున్నారు. వారికి 2017లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసే అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు.

ఇటీవల 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ గణితం, భౌతికశాస్త్రం పోస్టులకు వారు పోటీపడొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు వారికి త్వరలోనే అవకాశం ఇవ్వనున్నారు.