BIKKI NEWS (అక్టోబర్ – 02) : Bihar cast wise census 2023 released. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన వివరాలను ఈరోజు విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభా 13 కోట్లు. అనేక అవరోధాలు ఎదుర్కొంటు కులాల వారీగా జనగణన చేపట్టిన నితీష్ కుమార్ ప్రభుత్వం విజయవంతంగా కులజనగణన లెక్కలు పూర్తి చేసి విడుదల చేసింది.
బిహార్‌లో కులాల వారీగా జనాభా లెక్కించేందుకు 2019 ఫిబ్రవరి 18న అసెంబ్లీ తీర్మానం చేసింది.. 2022 జూన్ 2న బిహార్ మంత్రివర్గం రెండు దశల్లో కుల గణన నిర్వహించేందుకు నిర్ణయించింది. మొదటి దశలో ఇళ్లకు నంబర్లు ఇచ్చి ఈ ఏడాది జనవరి 7న జాబితా ప్రచురించారు. రెండో దశలో ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి కులాల వారీగా జనాభాను లెక్కించారు.
Bihar cast wise census 2023 released
కులాల వారీగా జనాభా శాతం
- ఇతర వెనుకబడిన కులాల (OBC) – 27.12%
- అత్యంత వెనుకబడిన వర్గాల వారు(EBC) – 36.01%
- షెడ్యూల్డ్ కులాల (SC) – 19.65%
- షెడ్యూల్డ్ తెగల (ST) – 1.68%
- అగ్రవర్ణాలు (OC) – 15.52%
- ఓబీసీలు 27.12 శాతం, ఈబీసీలు 36.01 శాతం కలుపుకొని బీసీలు 63.13% మంది ఉన్నారు.
మతాల వారీగా జనాభా శాతం
- హిందువులు – 81.9% (10,71,92,958 మంది)
- ముస్లింలు – 17.7% (2.31 కోట్లు).
- క్రైస్తవులు 0.05%
- బౌద్దులు – 0.08%,
- జైనులు – 0.009%
- 2,146 మంది తాము ఏ మతాన్ని అనుసరించడం లేదని చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 83 లక్షల 44 వేల 107 ఇళ్లున్నాయి. జనాభా మొత్తం 13 కోట్ల 7 లక్షల 25 వేల 10 మంది ఉన్నారు.
53 లక్షల 72 వేల 22 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు కులగణనలో తేలింది.
భారత్ లో కుల జనగణన లెక్కలు
1931 వరకు భారతదేశంలో కులాల వారీగా జనాభా లెక్కల్ని సేకరించారు. 1941లోనూ సేకరించినా ప్రచురించలేదు.
1951 నుండి 2011 వరకు జనాభా లెక్కల సేకరణలో ప్రతీ సారి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల డేటా సేకరించి ప్రచురిస్తున్నారు. కానీ ఓబీసీ, ఇతర కులాల డేటాను వెల్లడించడం లేదు.
1990లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం రెండో బీసీ కమిషన్ ఏర్పాటుకు సిఫార్సు చేసింది. దీనినే మండల్ కమిషన్‌గా పిలిచేవారురు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు అన్ని స్థాయుల్లోనూ 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయం భారతదేశం, ముఖ్యంగా ఉత్తర భారతదేశ రాజకీయాలను మార్చింది. 1931 జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకుని మండల్ కమిషన్ భారతదేశంలో ఓబీసీ జనాభా 52 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.