న్యూడిల్లీ (ఆగస్టు – 12) : ప్రాథమిక పాఠశాలలో (1- 5వ తరగతి) బోధించడానికి BEd పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు రాజస్థాన్ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తీర్పును వెలువరించారు. Bed candidates are not eligible to sgt jobs says supreme court
రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లెవెల్ – 1 (1 – 5వ తరగతి బోధన) కు కేవలం బేసిక్ స్కూల్ సర్టిఫికెట్ హోల్డర్ లు మాత్రమే అర్హులని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
బీఈడీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు లెవెల్ – 2 (6 – 8 వ తరగతి భోదన) పరీక్ష రాసుకోవచ్చని తీర్పులో పేర్కొంది.