ITI JOBS – ఏపీ ఐటీఐలలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (MARCH – 04) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ATO Contract JOBS IN AP ITIs) పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేశారు.

ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 20లోపు వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు మే 6న రాత పరీక్ష నిర్వహిస్తారు.

అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్: 71 పోస్టులు

ట్రేడులు: ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్, వైర్మన్, సీవోపీఏ, డ్రెస్ మేకింగ్, మెకానిక్ మోటార్ వెహికల్, కార్పెంటర్, వర్క్ షాప్ కాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఇంజినీరింగ్ డ్రాయింగ్.

అర్హతలు : సంబంధిత విభాగంలో బి. ఒకేషనల్/ డిగ్రీ/ డిప్లొమా/ ఎన్టీసీ / ఎన్ఎ్స ఉత్తీర్ణతతో పాటు పని
అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ:35,570.

వయోపరిమితి: 30/09/2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్ డెమో, పని అనుభవం తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ దరఖాస్తులకు

చివరి తేదీ: 20-03-2024.

దరఖాస్తు లింక్ : Apply here

వెబ్సైట్ : https://detrecruitments.apcfss.in/