ASIA CUP 2023 FINAL – ఇండియా – శ్రీలంక

కొలంబో (సెప్టెంబర్ 15) : ఆసియా కప్ 2023 ఫైనల్స్ లో టీమిండియా మరియు శ్రీలంక జట్లు మద్య మ్యాచ్ జరగనుంది (asia cup 2023 final between india vs srilanka). కీలకమైన శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో శ్రీలంక 2 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో పాకిస్తాన్ ఇంటికి శ్రీలంక ఫైనల్ కు చేరింది.

సెప్టెంబర్ 17వ తేదీన శ్రీలంక భారత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈరోజు నామమాత్రపు మ్యాచ్ భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనుంది.

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు వర్షం కారణంగా 42 ఓవర్లకు 251 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక జట్టు కుశాల్ మేండిస్ (91), అసలంక (49*) పరుగులతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.