Singareni – సింగరేణిలో అప్రెంటీషిప్

BIKKI NEWS (SEP. 13) : Apprenticeship in singareni 2024. సింగరేణి సంస్థలో ఐటీఐ పూర్తి చేసిన యువతీ, యువకులు 2024-25 విద్యా సంవత్సరానికి గాను అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీ-2 ఏరియా జీఎం ఎల్వీ సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

Apprenticeship in singareni 2024

ఐటీఐలో వివిధ విభాగాల్లో చదువుకున్న అభ్యర్థులకు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ హైదరాబాద్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీం వెబ్ పోర్టల్లో వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని సింగరేణి కార్మిక కుటుంబాల పిల్లలు, ప్రభావిత గ్రామాల పిల్లలు సద్వినియోగం చేసుకుకోవాలన్నారు.

సెప్టెంబర్ 7 నుంచి 23 వరకు వెబ్సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు