AP JOBS : AP NIT లో ఉద్యోగాలు

విజయవాడ (అక్టోబర్ – 17) : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (NIT AP RECRUITMENT) వివిధ
విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నవంబర్ 13వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు : బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్
ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్

అర్హతలు : సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ తో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం : మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : నవంబర్ 13

హార్డ్ కాపీలను పంపడానికి గడువు : నవంబర్ 20 – 2023

వెబ్సైట్ : https://www.nitandhra.ac.in/main/