ICAR JOBS : లక్షకు పైగా వేతనంతో అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉద్యోగాలు

హైదరాబాద్ (ఆగస్టు – 09) : దేశవ్యాప్తంగా ఉన్న ఐకార్ (ICAR) పరిశోధన సంస్థలు కేంద్రాలలో ఖాళీగా ఉన్న 368 సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులను శాశ్వత పద్ధతిలో భర్తీ చేయడానికి అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ASRB) నోటిఫికేషన్ ను జారీ చేసింది.

విద్యా అర్హతల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 8వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.

★ వివరాలు

1) ప్రిన్సిపల్ సైంటిస్ట్: 80 పోస్టులు
2) సీనియర్ సైంటిస్ట్: 288 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 368.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు పీజు : రూ.1,500/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లించనవసరం లేదు).

అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/ బోధన అనుభవం ఉండాలి.

వయో పరిమితి: ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులకు 52 ఏళ్లు, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 47 ఏళ్లు మించకూడదు.

వేతన స్కేల్: నెలకు ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులకు రూ.1,44,200-2,18,200, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు రూ.1,31,400-2,17,100.

ఎంపిక విధానం : విద్యార్హతల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తులు గడువు : 18/08/2023 నుంచి 08/09/2023 వరకు

ఆన్లైన్ ఫీజు చెల్లింపు గడువు : 08/09/2023.

వెబ్సైట్ : https://www.asrb.org.in/