ADITYA L1 – SUN FULL DISK IMAGES

BIKKI NEWS (DEC – 09) : ADITYA L1 TAKEN SUN FULL DISK IMAGES BY SUIT – ఆదిత్య L1 తన సోలార్ ఆల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (suit) సహాయంతో సూర్యుని యొక్క ఫుల్ డిస్క్ ఇమేజ్ లను చిత్రీకరించి ఇస్రో కేంద్రానికి పంపించింది. వాటిని ఇస్రో తాజాగా విడుదల చేసింది.

ఈ ఫోటోలను 200 నుండి 400 nm తరంగ ధైర్ఘ్య పరిధిలో కెమెరాలు బంధించాయి ఈ ఫోటోలలో సూర్యుని యొక్క క్రోమోస్ఫియర్, ఫోటో స్పియర్లు స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ఫోటోల సహాయంతో భూమిపై సౌర తరంగాల ప్రభావాన్ని నిశితంగా అధ్యయనం చేయవచ్చని తెలిపింది.

సెప్టెంబర్ 2న ప్రారంభమైన ఆదిత్య L1 ప్రయాణం త్వరలో లాంగ్రేజియన్ పాయింట్ వన్ వద్దకు చేరనుంది. అక్కడ నుంచే సూర్యునిపై అధ్యయనం చేయనుంది.