ENGLISH PRACTICALS – హ్యాండ్ బుక్ విడుదల

హైదరాబాద్ (జూలై – 06) : తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టులో కూడా ప్రాక్టికల్స్ ని ప్రవేశపెట్టడానికి కరదీపికను విడుదల చేశారు. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (IELTS) పేరుతో హ్యాండ్ బుక్ నుENGLISH PRACTICALS – IELTS) విడుదల చేశారు. కళాశాలలో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్లందరూ ఈ కరదీపిక ప్రకారమే ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ IELTS పరీక్షను విద్యార్థులు వినడం చదవడం రాయడం మాట్లాడడం వంటి పలు అంశాలతో పగడ్బందీగా నిర్వహించనున్నారు. కళాశాలలో ఇంగ్లీష్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి పై అంశాలలోవిద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించి అందుకు తగ్గట్లుగా మార్కులు వేయనున్నారు.

ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రథమ సంవత్సరంలో 20 మార్కులకు, ద్వితీయ సంవత్సరంలో 20 మార్కులకు ఈ సంవత్సరం నుండే ప్రాక్టికల్ పరీక్షలు అమలు చేయనున్నట్లు సమాచారం.