వైద్య కళాశాలల్లో 4,356 కాంట్రాక్టు ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (MARCH 13) : తెలంగాణ రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 4,356 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లను నియమించు కునేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనల మేరకు 3,155 మందిని ఒప్పంద విధానంలో, 1,201 మందిని గౌరవ వేతనంతో భర్తీ చేసేందుకు (4356 contract jobs in telangana medical hospitals) అనుమతులు ఇచ్చినట్లు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది మార్చి వరకు వీరిని నియమించనున్నారు. ఇందులో.. ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్లు 412, సీనియర్
రెసిడెంట్ పోస్టులు 1,201 ఉన్నాయి.

2021 అక్టోబరు నుంచి ఖాళీగా ఉన్న 4,356 టీచింగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించి అనుమ తులిచ్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

★ మార్చి 16న ఇంటర్వ్యూలు

ఈ నెల 16వ తేదీన ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

ప్రొఫెసర్ పోస్టుకు 8 ఏళ్లు, అసోసి యేట్ ప్రొఫెసర్ పోస్టుకు ఐదేళ్ల అనుభవం ఉండాలి.

ప్రొఫెసర్ కు నెల వేతనం రూ.1.90 లక్ష లు కాగా, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.1.25 లక్షలు, సీనియర్ రెసిడెంట్కు రూ.92,575, ట్యూటర్కు రూ.55 వేలు ఇవ్వనున్నారు.

దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు. అయితే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. స్థానికులు లేనప్పుడు ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు.

అభ్యర్థుల గరిష్ట వయస్సు ఈ నెల 31వ తేదీ నాటికి 69 ఏళ్లకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

వెబ్సైట్ : https://dme.telangana.gov.in