Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU MARCH 13th

DAILY GK BITS IN TELUGU MARCH 13th

DAILY GK BITS IN TELUGU MARCH 13th

1) సామాజిక కార్యకర్త అయిన మేధాపాట్కర్ ఏ ఉద్యమంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు.?
జ : నర్మదా బచావో ఆందోళన

2) జల్ జంగిల్ జమీన్ అను నినాదాన్ని ఎవరు ఇచ్చారు.?
జ : కొమరం భీమ్

3) స్త్రీలలో ఫలదీకరణం జరిగే ప్రాంతం ఏది?
జ : పెలోపియన్ నాళము

4) బందీపూర్ జాతీయ వనము గల రాష్ట్రం ఏది?
జ : కర్ణాటక

5) శాతవాహనుల తొలి రాజధాని ఏది .?
జ : కోటిలింగాల

6) 1857 విప్లవ అనంతరం భారతదేశంలో బ్రిటిష్ వారు సంపూర్ణంగా అమలుపంచిన విధానం ఏది?
జ : విభజించు పాలించు విధానము

7)సార్క్ కూటమి భావన ఎవరి మెదడులో ఉద్భవించింది.?
జ : జియా ఉల్ రెహమాన్

8) శబ్దం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
జ : అకోస్టిక్స్

9) దేశానికి పూర్ణ స్వరాజ్యం సాధించాలనే తీర్మానాన్ని చేసిన లాహోర్ అఖిలభారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏ సంవత్సరం జరిగింది.?
జ : 1929

10) సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు.?
జ : సూరితి అప్పయ్య

11) శిల్ఫి గురు అను అవార్డును కేంద్ర ప్రభుత్వం నుండి పొందిన మొదటి తెలంగాణ హస్తకళల కళాకారుడు ఎవరు.?
జ : కోవా నానేశ్వర్

12) హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 33 శాతానికి

13) తాల్చేరు బొగ్గు గనులు గల రాష్ట్రం ఏది.?
జ : ఒడిశా

14) భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని ఎవరు వ్యాఖ్యానించారు.?
జ : ఐవర్ జెన్నింగ్స్

15) మసాబ్ ట్యాంక్ ను ఎవరు నిర్మించారు.?
జ : హయత్ భక్స్ బేగం