Home > TODAY IN HISTORY > WORLD REFRIGERATION DAY : ప్రపంచ శీతలీకరణ దినోత్సవం

WORLD REFRIGERATION DAY : ప్రపంచ శీతలీకరణ దినోత్సవం

BIKKI NEWS : ప్రపంచ శీతలీకరణ దినోత్సవం (WORLD REFRIGERATION DAY) ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించబడుతుంది. రోజువారీ జీవితంలో శీతలీకరణ సాంకేతిక పరిజ్ఞానపు ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి, శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్, హీట్-పంప్ రంగాన్ని అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

ప్రపంచ శీతలీకరణ దినోత్సవ సెక్రటేరియట్ ఇంగ్లాండులోని డెర్బీషైర్‌లో ప్రపంచ శీతలీకరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ దినోత్సవం కోసం లార్డ్ కెల్విన్ పుట్టినరోజు 1824, జూన్ 26ను ఎంపిక చేశారు.

యునైటెడ్ కింగ్‌డమ్ రిఫ్రిజరేషన్ కన్సల్టెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫ్రిజరేషన్ మాజీ అధ్యక్షుడు స్టీఫెన్ గిల్ ఆలోచనలోంచి ఈ ప్రపంచ శీతలీకరణ దినోత్సవం వచ్చింది. 2018, అక్టోబరులో ది అమెరికన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్ సంస్థ ప్రపంచ శీతలీకరణ దినోత్సవానికి మద్దతునిచ్చింది. ఈ సంస్థకు 2019, జనవరిలో అట్లాంటాలో గిల్ ఇట్స్ జాన్ ఎఫ్ జేమ్స్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. 2019, ఫిబ్రవరిలో పారిస్‌లో జరిగిన జాతీయ ఓజోన్ అధికారుల సమావేశంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం మద్దతునిచ్చింది. తొలి ప్రపంచ శీతలీకరణ దినోత్సవం 2019, జూన్ 26న జరిగింది.