BIKKI NEWS (MAY – 03) : ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం (ప్రపంచ పత్రికా దినోత్సవం) (WORLD PRESS FREEDOM DAY 2023) ప్రతి సంవత్సరం మే 3న జరుపుకుంటారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం, దానిని రక్షించడం. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం అనేవి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం లక్ష్యాలు
ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు 1991, ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీవరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్ హాక్ నగరంలో సమావేశం ఏర్పాటుచేసి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు చేశారు.
ఆఫ్రికన్ జర్నలిస్టుల నిరసనకు గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని 1993, డిసెంబరు నెలలో ఐక్యరాజ్య సమితి యొక్క యూనెస్కో (unseco) నిర్వహిస్తుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంను జరుపుకుంటున్నారు.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం 2023 (world press freedom day 2023 theme) యొక్క థీమ్, యునెస్కోచే సెట్ చేయబడింది, “హక్కుల భవిష్యత్తును రూపొందించడం: అన్ని ఇతర మానవ హక్కులకు మూలంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ.”
ఈ థీమ్ పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర మరియు వైవిధ్యమైన మీడియా మరియు అన్ని మానవ హక్కులను సమర్థించడంలో భావ ప్రకటనా స్వేచ్ఛ యొక్క కీలక పాత్రను నొక్కి చెబుతుంది. ఈ థీమ్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం యొక్క 30వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రోజున యూనెస్కో మరియు గులెర్మో కానో ఇసాజ ఫౌండేషన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఫ్రైజ్ (world press freedom prize) ను ప్రపంచ వ్యాప్తంగా పత్రిక స్వేచ్ఛ కోసం కృషి చేసిన వ్యక్తి, సంస్థకు ఇస్తారు.