BIKKI NEWS (ఎప్రిల్ – 25) : ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏట ప్రపంచ మలేరియా దినోత్సవం (world malaria day on April 25th) నిర్వహిస్తారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు.
2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలన్ని కలిసి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటు చేశాయి. ఈ దినాన్ని ప్రతిసంవత్సరం ఏప్రిల్ 25 జరుపుకుంటారు.
2021లో మలేరియా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 6.27 లక్షల మంది మరణించారు.
మలేరియా వ్యాధి ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. మలేరియా ఔషధం క్వినైన్ ను సింకోనా అనే చెట్టు బెరడు నుండి తయారు చేస్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా నిర్మూలన కొరకు “RDS – S/AS01” వ్యాక్సిన్ కు అమోదం తెలిపింది.
ప్రపంచ దేశాలన్నింటిలో నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్, బుర్కినా ఫాసో, సియర్రా లియోన్ వంటి ఐదు దేశాలు ఎక్కువగా మలేరియా వ్యాధి బారినపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.