WORLD LEFT HANDERS DAY

BIKKI NEWS (AUGUST – 13) : ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం (WORLD LEFT HANDERS DAY) ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఎడమ చేతి వాటం ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై, ప్రధానంగా ప్రపంచంలో అధిక శాతంతో ఉన్న కుడి చేతి వాటం ప్రజల కారణంగా కృత్రిమంగా ఏర్పడిన సాంకేతిక సమస్యలపై అవగాహన గలిగించి వాటిని అధిగమించడానికి ఎడమ చేతి వాటం ప్రజలకు అవసరమైన ప్రోత్సాహానిచ్చేందుకు ఉద్దేశించబడింది.

ఈ దినోత్సవం మొదటిసారిగా 1976, ఆగస్టు 13న అంతర్జాతీయంగా ఎడమచేతి వాటం ప్రజలచే జరుపబడింది.

ప్రపంచంలో చాలామంది గొప్ప వ్యక్తులకు ఎడమ చేతివాటం ఉండటం విశేషం. ఎడమ చేతివాటం ఉన్న ప్రజలు చాలా తెలివిగలవారై ఉంటారని ఒక అభిప్రాయం ఉంది.