WORLD ELEPHANT DAY : ప్రపంచ ఏనుగుల దినోత్సవం

BIKKI NEWS (AUGUST 12) : ప్రపంచ ఏనుగుల దినోత్సవం (world elephant day) ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏనుగులను కాపాడి సంరక్షించాలన్న ఉద్దేశంతో 2012లో ఈ దినోత్సవం ఏర్పాటుచేయబడింది.

ఆకారం భారీగా ఉన్నా అందరితో ప్రేమగా కలిసిపోయే ఏనుగులకు కూడా భావోద్వేగాలుండటమే కాకుండా తెలివి, జ్ఞాపకశక్తి ఎక్కువ పాళ్ళలో ఉంటాయి. దంతాల కోసం, ఇతర శరీర భాగాల కోసం ఏనుగులను చంపేయడంతో, వాటి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. ఏనుగుల కోసం ఒక దినోత్సవం ఉంటే వాటి రక్షణపై అవగాహన పెరిగుతుందన్న ఉద్దేశ్యంతో కెనడాలోని కెనజ్వెస్ట్ పిక్చర్స్ చిత్రనిర్మాతలు ఏనుగుల సంరక్షణ ప్రచారకులు ప్యాట్రిసియా సిమ్స్‌, మైఖేల్ క్లార్క్ 2011లో దీనిని రూపొందించారు. థాయిలాండ్ లోని ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ సెక్రటరీ జనరల్ శివపోర్న్ దర్దరానంద మద్దతుతో ప్యాట్రిసియా సిమ్స్, ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2012, ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రారంభించబడింది. అప్పటినుండి ప్యాట్రిసియా సిమ్స్ ఈ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలోని 65కి పైగా వన్యప్రాణుల సంస్థలు, చాలామంది వ్యక్తులు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.

ఆఫ్రికా, ఆసియాలోని ఏనుగుల గురించి అవగాహన కల్పించడం, అడవి ఏనుగుల యొక్క సంరక్షణ పరిష్కారాలను పంచుకోవడం ఏనుగు హల దినోత్సవం సందర్భంగా చేస్తారు.

బందీలుగా ఉన్న ఆసియా ఏనుగులను అడవికి తిరిగి ప్రవేశపెట్టడం గురించి విలియం షాట్నర్ తీసిన రిటర్న్ టు ది ఫారెస్ట్ చిత్రం ప్రపంచ ఏనుగు దినోత్సవం సందర్భంగా విడుదలైంది. ఆఫ్రికన్ ఏనుగులు “హాని కలిగించేవి”గా, ఆసియా ఏనుగులు “అంతరించిపోతున్నవి” గా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్‌ జాబితా చేర్చబడ్డాయి. ఆఫ్రికన్, ఆసియా ఏనుగులు పన్నెండు సంవత్సరాలలో అంతరించి పోతున్నాయని ఒక పరిరక్షణాధికారి చెప్పాడు.ప్రస్తుతం ఆఫ్రికా ఏనుగుల సంఖ్య 4 లక్షలుండగా, ఆసియా ఏనుగులు నలభై వేలున్నాయి