BIKKI NEWS (సెప్టెంబర్ – 22) : ECONOMIC FREEDOM OF THE WORLD – 2023 Index – నివేదిక ప్రకారం (ఆర్థిక స్వేచ్ఛా సూచీ) మొత్తం 165 దేశాల్లో భారత్ కు 87వ స్థానం లభించింది. గతేడాది భారత్ 86వ ర్యాంకు సాధించగా.. ప్రస్తుతం ఒక స్థానం తగ్గింది. (India rank in economic freedom index 2023)
కెనడాకు చెందిన ఫ్రేసర్ ఇన్స్టిట్యూట్, దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సివిల్ సొసైటీతో కలిసి రూపొందించిన ‘ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్: 2021’ వార్షిక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, 1980 నుంచి ప్రస్తుత ఏడాది వరకు భారత్ రేటింగ్ 4.90 శాతం నుంచి 6.62 శాతానికి పెరిగినా, ర్యాంకు మాత్రం స్వల్పంగా తగ్గింది.
భారత్ పరిస్థితి మెరుగవుతున్నా, ఇతర దేశాలతో ఆర్థిక స్వేచ్ఛలో కాస్త వెనుకంజలో ఉందని తెలుస్తోంది. అయితే దక్షిణాసియాలో మాత్రం పోలిస్తే మెరుగ్గా ఉంది.
మొదటి పది దేశాలు
సూచీలో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాలలో హాంకాంగ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, యూఎస్, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, యూకే, కెనడాలు ఉన్నాయి.
చివరి పది దేశాలు
వెనిజులా చిట్టచివరి స్థానంలో నిలిచింది…. తర్వాత స్థానాలలో జింబాబ్వే, సిరియా, సూడాన్, యొమెన్, ఇరాన్, లిబియా, అర్జెంటీనా, అల్జీరియా.రిపబ్లిక్ ఆఫ్ కాంగో చివరి నుండి పది దేశాలు.
భారత పొరుగు దేశాలు
భూటాన్ – 87, నేపాల్ – 103, చైనా – 111, శ్రీలంక – 116, పాకిస్థాన్ – 123, బంగ్లాదేశ్ – 132, మయన్మార్ – 150వ స్థానాలలో ఉన్నాయి.