WORLD BOOK DAY : ప్రపంచ పుస్తక దినోత్సవం

BIKKI NEWS (ఎప్రిల్‌ – 23) : ప్రపంచ పుస్తక దినోత్సవం (ప్రపంచ కాపీ హక్కుల దినోత్సవం) (WORLD BOOK DAY APRIL 23rd ) ప్రతి ఏట ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.1995 నుండి నిర్వహించబడుతున్న ఈ ప్రపంచ పుస్తక దినోత్సవం రోజున పుస్తకం చదవడం, ప్రచురించడం, కాపీ హక్కులు వంటి విషయాలను ప్రోత్సహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తారు.

The theme for World Book Day 2024 is “Read Your Way“.

వాలెనియన్ రచయితైన విసెంటే క్లావెల్ ఆండ్రెస్ కు పుస్తక దినోత్సవం జరపాలని మొట్టమొదటగా ఆలోచన వచ్చింది. ప్రపంచ రచయిత మిగ్యుఎల్ డి సెర్వంటెస్ పుట్టిన తేది (అక్టోబర్ 7)గానీ, మరణించిన తేది (ఏప్రిల్ 23)గానీ పుస్తక దినోత్సవంగా చేసి ఆయనకు గౌరవాన్ని అందించాలనుకున్నాడు. అయితే విలియం షేక్స్పియర్, గార్సియాసా డి లా వేగా వంటి రచయితలు మరణించిన తేది, అనేక ఇతర రచయితల పుట్టిన, మరణించిన తేది ఏప్రిల్ 23వ తేది అవడంవల్ల 1995, ఏప్రిల్ 23న యునెస్కో తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంను నిర్వహించింది.

యునెస్కో ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఒక ముఖ్య నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంది. 2023 సంవత్సరానికి గానూ ఆఫ్రికన్‌ దేశం ఘనాలోని ఆక్రా నగరంను ప్రపంచ పుస్తక నగరంగా ప్రకటించారు. 2024 లో స్ట్రాస్‌బర్గ్ పుస్తక రాజధాని గా ఉండనుంది.

  • 2001 లో మొదటిసారి మాడ్రిడ్ ను ప్రపంచ పుస్తక రాజధాని గా యునెస్కో ప్రకటించింది.
  • 2003 లో న్యూడిల్లీ ప్రపంచ పుస్తక రాజధాని గా ఉంది.
  • 2023 ప్రపంచ పుస్తక రాజధాని గా ఘనా రాజధాని గా అక్రా ఉంది.
  • 2024 ప్రపంచ పుస్తక రాజధాని గా స్ట్రాస్‌బర్గ్