WORLD BIO FUEL DAY : ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం

BIKKI NEWS (ఆగస్టు – 10) : ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం (WORLD BIO FUEL DAY) ను ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఖనిజేతర ఇంధనాలను ప్రోత్సహించడం కోసం, జీవ ఇంధనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంకోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది. world bio fuel day august 10th

మొదటి డీజిల్ ఇంజిన్ పని చేయడానికి నాలుగు దశాబ్దాల ముందు అంటే 1853లోనే పాట్రిక్ డఫీ చేత, కూరగాయల నూనె ట్రాన్స్‌స్టెరిఫికేషన్ నిర్వహించబడింది. మోటారు వాహనాలను నడపడానికి డీజిల్‌ ఇంజిన్‌ను సృష్టించిన జర్మన్‌ శాస్త్రవేత్త సర్‌ రుడాల్ఫ్‌ జర్మనీలోని ఆగ్స్‌బర్గ్‌లో మొదటిసారిగా 1893, ఆగస్టు 10న వేరుసెనగ నూనెను ఇంధనంగా ఉపయోగించి 10 అడుగుల (3.05 మీ) ఐరన్ సిలిండరును పని చేయించాడు. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుతున్నారు