హైదరాబాద్ (డిసెంబర్ – 07) : వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్ ను ఇంతకు ముందు ట్రైన్ – 18 అనేవారు. ఈ రైలు భారత్ లో మొట్టమొదటి అత్యాధునిక సెమీ హైస్పీడ్ ఎలిక్ట్రిక్ రైలు. తమిళనాడు రాష్ట్రంలోని పెరంబూర్ లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద తయారు అవుతున్నాయి. భారతీయ రైల్వే వీటిని నిర్వహిస్తుంది.
మొదటి జనరేషన్ రైల్ వేగం 130 కీమీ గంటకు, రెండో జనరేషన్ రైల్ విభాగం 160 కీమీ గంటకు ప్రయాణించును. (ఘటీమాన్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా ప్రయాణించే రైలు)
ఒక్క వందేభారత్ రైలు నిర్మాణానికి 100 – 120 కోట్లు ఖర్చు అవుతుంది.
మొదటి వందేభారత్ రైలు న్యూడిల్లీ – వారణాసి మద్య ఫిబ్రవరి 15 – 2019
★ వందేభారత్ రైలు వివరాలు
S.No. | రూట్ | దూరం కీ.మీ. | ప్రారంభ తేదీ |
1 | న్యూడిల్లీ – వారణాసి | 759 | ఫిబ్రవరి – 15 – 2019 |
2 | న్యూడిల్లీ – శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా | 655 | అక్టోబర్ – 03 – 2019 |
3 | న్యూడిల్లీ – అంధురా | 522 | సెప్టెంబర్ – 30 – 2022 |
4 | ముంబై – గాంధీనగర్ | 412 | అక్టోబర్ – 13 – 2022 |
5 | చెన్నై – మైసూర్ | 496 | నవంబర్ – 11 – 2022 |
6* | బిలాస్‌పూర్ – నాగపూర్ | 412 | డిసెంబర్ – 11 – 2022 |