Home > JOBS > TELANGANA JOBS > AGE LIMIT – యూనిఫామ్ సర్వీస్ ల వయోపరిమితి పెంపు

AGE LIMIT – యూనిఫామ్ సర్వీస్ ల వయోపరిమితి పెంపు

BIKKI NEWS (FEB. 20) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భాగంగా వివిధ యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ (uniforms services age limit increased by 2 years) ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందే యూనిఫామ్ కాని సర్వీస్ లకు కూడా రెండేళ్లు పెంచిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలోని యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి రాబోయే రిక్రూట్మెంట్లకు ఇది వర్తించనుంది. యూనిఫామ్ సర్వీసులు పరిధిలోకి వచ్చే వివిధ సర్వీసులు, కేటగిరీల పోస్టులు.. పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖ ఉద్యోగాలకు ఐదేళ్ల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో నిరుద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో మరింత మంది నిరుద్యోగ యువతకు అర్హత కల్పించే ఉద్దేశంతో యూనిఫామ్ సర్వీసెస్ కు కూడా గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.