ఓపెన్, డిస్టెన్స్ నిర్వహణకు యూజీసీ అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ (డిసెంబర్ 01) : దేశంలోని విశ్వవిద్యాలయాలు ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ పద్ధతుల్లో కోర్సులను ఆఫర్ చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిర్దేశిత నిబంధనలన్నింటినీ పాటిస్తూ యూజీసీ అనుమతితో ఎంత కాలం కావాలంటే అంత కాలం పాటు యూనివర్సిటీలు ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులను ఆఫర్ చేయవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది.