TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 11 – 2024

BIKKI NEWS (NOV. 08) : TODAY NEWS IN TELUGU on 8th NOVEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 8th NOVEMBER 2024

TELANGANA NEWS

తెలంగాణటెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.

ఇంటర్మీడియట్ విద్య లో క్వశ్చన్ బ్యాంకు మిస్సింగ్ వార్తలను ఖండించిన ఇంటర్మీడియట్ బోర్డు.

జైలుకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు అని కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.

ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ డీఈవో రవీందర్ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు.

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో నిర్వ‌హించిన ఫార్ములా-ఈ రేస్‌తో హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

11 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేకత – కిషన్ రెడ్డి

నవంబర్ 08 న నల్గొండ లో సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ యాత్ర.

త్వరలోనే అటం బాంబు పేలుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ బస్సులు.

అగ్రిగోల్డ్ కేసులో ఈడీ అనుబంధ చార్జీషీట్ దాఖలు చేసింది.

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ఫెయిల్‌ అయితే సంబంధిత మంత్రిని ప్రశ్నించాల్సింది కాదని చంద్రబాబును ప్రశ్నించాలని పవన్‌కు జగన్మోహన్ రెడ్డి సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వైసీపీకి మైక్‌ ఇచ్చే పరిస్థితి లేనప్పడు అసెంబ్లీ సమావేశాలకు పోవడం ఏం ఉపయోగం లేదని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

సోషల్‌ మీడియా ద్వారా అడ్డు, అదుపులేకుండా ఆడపిల్లల వ్యక్తిగత విషయాలపై విష ప్రచారం చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు

ప్రభుత్వ రికార్డులో గ్రామ వాలంటీర్ల అంశమే లేదు- పవన్‌కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

NATIONAL NEWS

ఉద్యోగ నియామకాల వేళ మద్య లో నిబంధనలు మార్పు కుదరదు. సుప్రీం కోర్ట్

పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రెట్టింపు జరిమానా విధించేలా నిబంధనలను కేంద్రం సవరించింది. రూ.30 వేల వరకూ జరిమానాను పెంచింది.

బ్రిటన్‌ మాజీ ప్రధాని, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బెంగళూరులో తన భార్యతో కలిసి పర్యటించారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత 367గా నమోదైంది.

జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో గంద‌ర‌గోళం.. అధికార‌, ప్ర‌తిక్షాల మ‌ధ్య వాగ్వాదం.

డోనాల్డ్ ట్రంప్‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. భార‌త్‌, అమెరికా మ‌ధ్య ఉన్న వాణిజ్య బంధాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

మ‌న దేశంలో మ‌ర‌ణ‌శిక్ష రాజ్యాంగ‌బ‌ద్ద‌మేనా అని సీజేఐ చంద్ర‌చూడ్ అర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ లాయ‌ర్‌కు ప్ర‌శ్న వేశారు. దానికి ఏఐ లాయ‌ర్ అవును, మ‌ర‌ణ‌శిక్ష భార‌త్‌లో రాజ్యాంగ‌బ‌ద్ద‌మే అని స‌మాధానం ఇచ్చారు.

INTERNATIONAL NEWS

గల్ఫ్‌ దేశం సౌదీ అరేబియా లో భారీగా మంచు కురుస్తుంది. ఇలా ఈ ఎడారి దేశంలో మంచు కురవడం చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.

అధికార మార్పిడి విష‌యంలో ట్రంప్‌న‌కు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు క‌మ‌లా హారిస్ తెలిపారు

2025 జనవరి 20న మధ్యాహ్నం డోనాల్డ్ ట్రంప్ అమెరికా దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

సునీత విలయమ్స్ ఆరోగ్యం నిలకడగానే ఉందని నాసా ప్రకటన.

సీఐఏ చీఫ్‌గా భార‌తీయ సంత‌తికి వ్య‌క్తి అయినా క‌శ్య‌ప్ ప‌టేల్ కు అమెరికా కొత్త అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కీల‌క ప‌ద‌విని అప్ప‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

భారత్, కెనడా మధ్య సంబంధాల ప్రతిష్టంభన గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. దీనిని ప్రసారం చేసిన ఆస్ట్రేలియా మీడియా సంస్థను కెనడా నిషేధం విధించింది.

BUSINESS NEWS

నష్టపోయిన స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ : 79,542 (-836)
నిఫ్టీ : 24,199 (-285)

ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1,650 పతనమై రూ.79,500 వద్దకు చేరుకుని రూ.80వేల దిగువకు పడిపోయింది. మరోవైపు కిలో వెండి ధర రూ. 2,900 పతనమై రూ.93,800 వద్ద నిలిచింది.

వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వు తీసుకునే నిర్ణయం పై స్టాక్ మార్కెట్ కదలికలు ఉండనున్నాయి.

ఎడిల్ గివ్ హరున్ ఇండియా ఫిలాంథ్రఫీ లిస్ట్ -2024 లిస్ట్ లో మొదటి స్థానంలో శివ్ నాడార్, రెండో స్థానంలో ముఖేశ్ అంబానీ, మూడో స్థానంలో బజాజ్ కుటుంబం ఉంది.

SWIGGY IPO ఆదరణ అంతంత మాత్రమే.

జెట్ ఎయిర్ వేస్ లిక్విడేషన్ కు సుప్రీంకోర్టు అనుమతి

SPORTS NEWS

తెలంగాణ చెస్ క్రీడాకారుడు అర్జున్ ఇరగెశి ఫీడే ప్రపంచ 2వ ర్యాంక్ ను సాదించాడు

నేటి నుంచి సౌతాఫ్రికా తో టీట్వంటీ సిరీస్.

ఇండ్లండ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవ‌సం చేసుకున్న‌ది.

విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీకి స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు భూమి పూజ చేశారు.

కెప్టెన్ మీద కోపంతో.. మైదానం విడిచి వెళ్లిన విండీస్ బౌల‌ర్‌ అల్జ‌రీ జోసెఫ్

మహిళ ప్రీమియర్ లీగ్ (WPL) లో జట్లు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా విడుదల చేశాయి

EDUCATION & JOBS UPDATES

TG TET – తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల

TGPSC – డిపార్ట్మెంటల్ పరీక్షలు 2024 నవంబర్ సెషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల. నవంబర్ 25 నుండి డిసెంబర్ 03 వరకు పరీక్షలు.

ఇంటర్మీడియట్ విద్య లో క్వశ్చన్ బ్యాంకు మిస్సింగ్ వార్తలను ఖండించిన ఇంటర్మీడియట్ బోర్డు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు నవంబర్ 14 వరకు పొడగించినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు