TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 11 – 2024

BIKKI NEWS (NOV. 05) : TODAY NEWS IN TELUGU on 5th NOVEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 5th NOVEMBER 2024

TELANGANA NEWS

ధాన్యం కొనుగోళ్ళకు ప్రత్యేక అధికారుల నియామకం- సీఎం

రేషన్ కార్డు లేకున్నా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు – మంత్రి పొంగులేటి

డ్రాపౌట్స్ తగ్గించాలి – విద్యార్థులతో భేటీలో సీఎం

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు.

బీసీ రిజర్వేషన్లపై ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీ వెంకటేశ్వర్లు సారధ్యంలో ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది.

రాష్ట్ర ఆరోగ్య శాఖ‌లో ఖాళీగా ఉన్న 1284 ల్యాబ్ టెక్నిషీయ‌న్స్ గ్రేడ్-II పోస్టుల‌కు ఈ నెల 10వ తేదీన కంప్యూట‌ర్ బేస్డ్ టెస్టు నిర్వ‌హించ‌నున్నారు

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8 నుంచి మూసీ నది వెంట పాదయాత్ర చేపట్టనున్నారు.

ఆర్టీస బస్సు బోల్తాపడటంతో డ్రైవర్‌తో పాటు పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చౌటుప్పల్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. నవంబర్ 5 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ వాణీ ప్రసాద్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేయబోయి ప్రమాదవశాత్తు పంటపొలాల్లోకి దూసుకెళ్లింది.

పెండింగ్‌ బిల్లుల కోసం మాజీ సర్పంచుల పోరుబాట.. ఎక్కడికక్కడ అరెస్టులు

ANDHRA PRADESH NEWS

నేను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి.. పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

ఇప్పటికైనా హోంమంత్రిని మార్చేయండి.. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలతో వైసీపీ మహిళా నాయకుల డిమాండ్‌

ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్ 11న నోటిఫికేషన్, డిసెంబర్ 5న ఎన్నిక, 9న ఓట్ల లెక్కింపు.

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం తాడిపర్రులో విద్యుదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

NATIONAL NEWS

ఉత్తరాఖండ్‌ లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో సీఎం సిద్ధ రామయ్యకు లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేశారు.

ఢిల్లీలో 400 మార్క్‌ను దాటిన గాలి నాణ్యత

బీజేపీ పాలిత యూపీలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైంది. 50 కన్నా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.

ఆగ్రా శివారులో కూలిన మిగ్‌ 29 విమానం.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్‌, కో పైలట్‌..

క‌ర్ణాట‌క‌లో గ్లాస్ కోటెడ్ మాంజాపై నిషేధం.

బాణాసంచా నిషేధాన్ని ఎందుకు అమలు చేయలేదు..? ఢిల్లీ సర్కారును ప్రశ్నించిన సుప్రీంకోర్టు

నవంబర్‌ 13న జరగాల్సిన ఉప ఎన్నికల పోలింగ్‌ను నవంబర్‌ 20కి వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు.

జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ ఎన్నికయ్యారు.

INTERNATIONAL NEWS

నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు. ఓటింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.

లాహోర్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 1,067 పాయింట్లు నమోదైంది.

ఇండోనేషియాలో మరో అగ్నిపర్వతం బద్ధలైంది. ఫ్లోర్స్‌ దీవి లోని మౌంట్‌ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం బద్దలైంది. 9 మంది మృతి చెందారు.

కెనెడా లో తాజాగా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల ఖలిస్థానీలు విధ్వంసం సృష్టించారు.

వరదల కారణంగా నష్టపోయిన పపోరాట పట్టణంలో బాధితుల పరామర్శకు వెళ్లిన స్పెయిన్‌ రాజ కుటుంబానికి తీవ్ర అవమానం జరిగింది. రాజు ఫిలిప్‌ 6, రాణి లెతిజియా ముఖాలపై బురద జల్లారు.

పశ్చిమాసియాలో బీ-52 బాంబర్లును మోహరించిన అమెరికా.. మండిపడ్డ ఇరాన్‌ చీఫ్‌

BUSINESS NEWS

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 78,782 (-942)
నిఫ్టీ : 23,995 (-309)

దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1300 తగ్గి 81,000లకు పడిపోయింది.

2025లో రిలయన్స్ జియో ఐపీఓ.. 112 బిలియన్ డాలర్ల నిధుల సేకరణే లక్ష్యం.

ఇంకా ప్రజల వద్ద రూ.6,970 కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది.

SPORTS NEWS

మొదటి ఐసీసీ మ‌హిళ‌ల చాంపియ‌న్స్ ట్రోఫీ 2027లో శ్రీ‌లంక వేదిక‌గా జ‌రుగ‌నుంది. జూన్ – జూలై నెల‌ల మ‌ధ్య ఈ టోర్నీ జరగనుంది.

నవంబ‌ర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఐపీఎల్ మెగా వేలం పాట నిర్వ‌హించ‌నున్నార‌ని సమాచారం.

భారత స్టార్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ వృద్ధిమాన్‌ సాహా అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‌ తనకు చివరిదని ప్రకటించాడు.

స్టార్క్ స్వదేశంలో 54 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 100 వికెట్లు తీశాడు. దాంతో, 55 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు ప‌డ‌గొట్టిన‌ బ్రెట్ లీ రెండో ర్యాంకుకు ప‌డిపోయాడు.

EDUCATION & JOBS UPDATES

AP TET 2024 RESULTS విడుదల

TG TET 2024 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటాను 2 నుండి 3% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం.

రాష్ట్ర ఆరోగ్య శాఖ‌లో ఖాళీగా ఉన్న 1284 ల్యాబ్ టెక్నిషీయ‌న్స్ గ్రేడ్-II పోస్టుల‌కు ఈ నెల 10వ తేదీన కంప్యూట‌ర్ బేస్డ్ టెస్టు నిర్వ‌హించ‌నున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు