TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 01 – 09 – 2024

BIKKI NEWS (SEP. 01) : TODAY NEWS IN TELUGU on 1st SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 1st SEPTEMBER 2024

TELANGANA NEWS

అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని దీంతో రాష్ర్టానికి రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినట్టు వాతావరణ శాఖ సంచాలకులు శనివారం తెలిపారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన సీఎస్‌ శాంతికుమారితో మాట్లాడుతూ… రెవెన్యూ, మున్సిపల్‌, విద్యు త్తు, వైద్యారోగ్య శాఖాధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు.

రాష్ట్ర ఉద్యోగులపై కాం గ్రెస్‌ సీపీఎస్‌ను రుద్దిన రోజైన సెప్టెంబర్‌ 1ని ఉద్యోగ సంఘాలు ‘పెన్షన్‌ విద్రోహ దినం’గా పాటిస్తూ వస్తున్నా యి. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలని ఆదివా రం తెలంగాణ ఎంప్లాయీస్‌ జేఏసీ గన్‌పార్క్‌ వద్ద ధర్నా చేపట్టనున్నది.

కాళేశ్వరం విచారణ కమిష న్‌ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పెంచుతూ నిర్ణయం,

రాష్ట్రంలో త్వరలో జరగనున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

విద్యార్థులు లేరన్న కారణంతో ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 1,864 సూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పాలమాకులలోని కస్తూర్బాగాంధీ గిరిజన హాస్టల్‌ను మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డితో హరీష్ రావు కలిసి సందర్శించారు

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంతంలో నేవీ సిగ్నల్‌ రాడర్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసేందుకు ఉన్నతాధికారులు పనులను ముమ్మరం చేశారు.

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై దృష్టి సారించాలి.. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం.

ఏ విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణకు చెందిన డాక్టర్‌ నందవరం మృదుల ఎంపికయ్యారు.

ANDHRA PRADESH NEWS

విజయవాడలో కొండచరియలు విరిగి నలుగురు మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ సర్కార్‌

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థినులకు మద్దతు తెలిపిన పూనమ్‌ కౌర్‌.. ఎంతటి శక్తివంతులైన వదలొద్దంటూ విన్నపం.

జగన్‌ బాటలోనే చంద్రబాబు వెళ్తున్నారు.. వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు.

300 మంది ఆడపిల్లలను పట్టించుకోట్లేదు కానీ.. ముంబై నటిపై అత్యంత శ్రద్ధ పెట్టారు.. గుడ్లవల్లేరు ఘటనపై మార్గాని భరత్‌ సీరియస్‌.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో మళ్లీ ఉద్రిక్తత.. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో 6, తెలంగాణలో 9 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

వరదలో కొట్టుకుపోయిన కారు.. టీచర్‌ సహా ఇద్దరు విద్యార్థులు మృతి.

NATIONAL NEWS

దేశంలోని పలు ఔషధ కంపెనీలకు ఊరట లభించింది. 156 ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్స్‌ (ఎఫ్‌డీసీ) మందులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.

గతంలో ఏర్పడిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే నాసా వ్యోమగాములైన ఇండో అమెరికన్‌ సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ విల్‌మోర్‌లను ఎనిమిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉంచాల్సి వస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌ మరోమారు చిక్కుల్లో పడ్డారు. పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తి చేసే ఆయుర్వేద పళ్ల పొడి ‘దివ్య మంజన్‌’లో మాంసాహార ఆనవాళ్లు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు బాబా రాందేవ్‌, పతంజలి సంస్థకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మారింది. ముందు ప్రకటించిన విధంగా ఈ ఏడాది అక్టోబర్‌ 1న కాకుండా అదే నెల 5న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.

సెప్టెంబర్‌లో భారీగానే వానలు.. సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం : ఐఎండీ

కాంగ్రెస్ అధినేత అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలో జరిగే పలు ముఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమం జరుగనున్నది.

మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆందోళనకరం.. ఈ కేసుల్లో సత్వర న్యాయం జరగాలి : ప్రధాని మోదీ

ఫిల్మ్ సెట్‌లో ఉండే కార‌వాన్‌లో .. హీరోయిన్లు దుస్తులు మార్చుకుంటున్న‌ప్పుడు .. సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలు తీశార‌ని న‌టి రాధిక ఆరోపించారు.

200 రోజులకు చేరుకున్న రైతుల ఉద్యమం.. ఆందోళనల్లో పాల్గొననున్న వినేశ్‌ ఫోగట్‌.. కంగనపై చర్యలకు డిమాండ్‌

INTERNATIONAL NEWS

భూమి లోపల ఉండే బాహ్య కేంద్ర మండలం(ఔటర్‌ కోర్‌) లోపల డోనట్‌ ఆకారంలో ఒక ప్రాంతం దాగి ఉన్నట్టు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఒక వైపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి సన్నాహాలు జరుగుతుండగా ఇజ్రాయెల్‌ దళాలు శనివారం గాజా స్ట్రిప్‌పై దాడి చేశాయి. ఈ ఘటనలో 48 మంది మృతి చెందారు.

షేక్ హసీనాకు ఆశ్రయం వల్ల భారత్‌కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాకు ఆశ్రయంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

రష్యాలో ఓ హెలికాప్టర్‌ మిస్సైంది. రష్యన్ ఫార్ ఈస్ట్‌లోని కమ్‌చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 శ్రేణికి చెందిన హెలికాప్టర్ అదృశ్యమైనట్లు రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది.

ట్రంప్‌ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం.. స్టేజ్‌వైపు దూసుకొచ్చిన దుండగుడు.

సోష‌ల్ మీడియా సంస్థ ఎక్స్‌పై .. బ్రెజిల్‌లో నిషేధం విధించారు. సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ లోపు.. ఆ దేశానికి లీగ‌ల్ ప్ర‌తినిధిని ఎక్స్ సంస్థ నియ‌మించ‌లేదు. దీంతో ఆ మీడియాపై సుప్రీం జ‌డ్జి బ్యాన్ విధించారు.

BUSINESS NEWS

ముడి చమురుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను తగ్గించింది. టన్ను ధరను రూ.250 తగ్గించడంతో రూ.2,100 నుంచి రూ.1,850కి దిగొచ్చింది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పెట్టే ఖర్చుల్లో ప్రతిష్ఠంభన నెలకొనడం వల్లనే వృద్ధిరేటు మందగించిందని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు.

SPORTS NEWS

పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో రుబినా ఫ్రాన్సిస్‌ కాంస్య పతకంతో సత్తా చాటింది.

ఆర్చరీలో కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న శీతల్‌దేవి, సరితాదేవికి నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో శివరాజన్‌, కృష్ణ నాగర్‌ ఓటమిపాలయ్యారు.

యూఎస్పు ఓపెన్ పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌ పోరులో జొకోవిచ్‌ 4-6, 4-6, 6-2, 4-6తో 28వ సీడ్‌ అలెక్సీ పాపిరిన్‌(ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలయ్యాడు.

పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్‌ జోడీ 6-2, 6-4తో కార్బెలాస్‌ బెనా, కొరియా ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరింది.

భారత క్రికెట్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ ద్రవిడ్‌..అండర్‌-19 జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌ల కోసం బీసీసీఐ జూనియర్‌ జట్లను శనివారం ప్రకటించింది.

థాయ్‌లాం డ్‌ వేదికగా జరిగిన ఐటీఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టెన్నిస్‌ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్‌ సాయికార్తీక్‌రెడ్డి రన్నర్ గా నిలిచాడు.

ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లో ప్రియాన్ష్ ఆర్యా ఒకే ఓవ‌ర్లో ఆరు సిక్స‌ర్లు కొట్టి రికార్డు సృష్టించాడు.

EDUCATION & JOBS UPDATES

TGPSC గ్రూప్ 3 దరఖాస్తు ఎడిట్ అవకాశం. సెప్టెంబర్ 2 – 6 వరకు.

తెలంగాణ ఎడ్ సెట్ తొలి విడత సీట్లు కేటాయింపు.

హైదరాబాద్ మనూ లో దూరవిద్య అడ్మిషన్స్. డిగ్రీ, పీజీ కొర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్

ఇండియన్ ఆర్మీ లో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులకు నోటిఫికేషన్ (02/2024)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు