చరిత్రలో ఈరోజు నవంబర్ 22

★ సంఘటనలు

1956: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్లో ప్రారంభమయ్యాయి.
1965: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.డి.పి (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం – ఐక్యరాజ్యసమితి ఆభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైనది.
1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
1980: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరామ్ జక్కర్ పదవిని స్వీకరించాడు.
1988: బాబా ఆమ్టేకు ఐరాస మానవహక్కుల సంఘం పురస్కారం లభించింది.
1997: హైదరాబాదులో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు.

★ జననాలు

1830: ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి. (మ.1858)
1864: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (మ.1955)
1907: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (మ.1997)
1913: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (మ.1988)
1933: నీరుకొండ హనుమంతరావు, ఖమ్మం జిల్లాకు చెందిన కవి. (మ.2016)
1967: బోరిస్ బెకర్, జర్మనీకి చెందిన మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు.
1970: మర్వన్ ఆటపట్టు, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్.

★ మరణాలు

1963: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (జ.1917)
2006: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (జ.1917)
2016: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వాగ్గేయకారుడు. (జ.1930)
2019: షౌకత్ అజ్మీ, భారతీయ నాటకరంగ, సినిమా నటి. (జ.1926)