★ దినోత్సవం
- రవాణా దినం.
- ప్రపంచ సైన్స్ దినోత్సవం .
★ సంఘటనలు
1990: భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ నియమితుడైనాడు.
★జననాలు
1483: మార్టిన్ లూథర్, క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత, బైబిల్ గ్రంథాన్ని తొలిసారిగా ప్రజాభాషలోనికి అనువదించిన వేదాంతి.
1798: ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్, (మ.1884)
1848: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1925)
1904: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (మ.1996)
1911: ఏటుకూరి వెంకట నరసయ్య, క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాది. (మ.1949)
1920: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004)
1942: రాబర్ట్-ఎఫ్-ఏంజిల్, ఆర్థికవేత్త .
1956: మాడభూషి శ్రీధర్, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్.
★ మరణాలు
1949: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (జ.1911)
1979: తెన్నేటి విశ్వనాధం, స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత.
1992: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1926)
1993: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (జ.1922)
2019: టి. ఎన్. శేషన్ 10వ భారత ఎన్నికల ప్రధాన కమీషనర్. (జ.1932)
2020: జీడిగుంట రామచంద్ర మూర్తి, తెలుగు రచయిత, ఆకాశవాణి ప్రయోక్త.