చరిత్రలో ఈరోజు జూన్ 03

దినోత్సవం

  • ప్రపంచ సైకిల్ దినోత్సవం

సంఘటనలు

1947: బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటన్ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని స్వదేశసంస్థానాలకు సార్వభౌమత్వం తొలగించబడుతుందని ప్రకటించాడు.
1962: ఫ్రాన్స్ లోని ఓర్లీ విమానాశ్రయం లో బోయింగ్ 707 విమానం దుర్ఘటన.
1984 : అమృత్‌సర్లో గల సిక్కుల దేవాలయం స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగింది.

జననాలు

1726: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (మ.1797)
1911: గుమ్మలూరి సత్యనారాయణ, డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు.
1924: కరుణానిధి, భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి.
1929: చిమన్‌భాయి పటేల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.1994).
1930: జార్జి ఫెర్నాండెజ్, భారత రాజకీయవేత్త.
1952: బండి నారాయణస్వామి, కథారచయిత, నవలాకారుడు. ‘స్వామి’ పేరుతో పేరొందాడు.
1965: సురీందర్ ఖన్నా, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1966: రాధ, భారతీయ సినీనటి.
1972: టి. హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
1973: రాజేష్ కృష్ణన్, కన్నడ, తెలుగు, నేపథ్య గాయకుడు.

మరణాలు

1657: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (జ.1578)
1979: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (జ.1911)
2004: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)
2007: రత్నమాల (నటి), నటన సినీ ప్రపంచములో పలువురి మన్ననలను అందుకొన్నది.
2011: కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)
2016: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ (జ.1942)
2019: బి.కె.బిర్లా బిర్లా కుటుంబానికి చెందిన భారతీయ వ్యాపారవేత్త. (జ.1921)