చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 09

★ దినోత్సవం

  • తెలంగాణ భాషా దినోత్సవం. (కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా)

★ సంఘటనలు

1908 – ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం బాధ్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1914 ఏప్రిల్ 1 నాడు దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై)

★ జననాలు

1892: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (మ.1981)
1898: కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1972)
1914: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (మ.2002)
1935: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (మ.2012)
1940: రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (మ.2020)
1953: సి.హెచ్. మల్లారెడ్డి, 16వ లోక్‌సభలో మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు.
1953: మంజుల భారతీయ సినీ నటీమణి. (మ.2013)
1957: జయచిత్ర , తెలుగు ,తమిళ చిత్రాల నటి
1961: సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్‌లో నిపుణురాలు.
1963: లక్ష్మీ. టి, రంగస్థల నటి.
1987: తథాగత్ అవతార్ తులసి, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బాలమేధావి.

★ మరణాలు

1952: వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన ఇంజనీరు. (జ.1910)
1978: జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్), చిత్రాల రారాజు. హాలీవుడ్లో వార్నర్ బ్రదర్స్ ఒకటి. (జ. 2 ఆగష్టు 1892)
2003: గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1927)