GST Council Meet – ఆ వస్తువులు, సేవలపై జీఎస్టీ తగ్గింపు

BIKKI NEWS (JUNE 22) : Today gst council meeting decisions. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చిరు వ్యాపారులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పలు సేవలపై జిఎస్టి తగ్గిస్తూ, పరిధులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాలను నిర్మల సీతారామన్ మీడియా సమావేశంలో వివరించారు.

గతేడాది అక్టోబర్ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగడం ఇదే తొలిసారి అని నిర్మలా సీతారామన్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల వల్ల చాలా కాలం తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిందని తెలిపారు.

ఈ రోజు చర్చించిన అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత మరోమారు చర్చిస్తామని తెలిపారు. మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై ఈ రోజు చర్చించిన అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు త్వరలోనే ఉండమన్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సాధారణ ఎన్నికల కారణంగా మద్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టవలసి ఉంది.

Today gst council meeting decisions

జీఎస్టీ పై ట్రిబునళ్లు, కోర్టుకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

వ్యాపారులు జరిమానా చెల్లించడంలో ఆలస్యమైతే, దానిపైన వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందని, దీన్ని ఎత్తేయాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.

ఇన్ పుట్ క్రెడిట్ టాక్స్ విషయంలో మోసాలు జరుగకుండా ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి అమలు చేయాలని నిర్ణయించారు.

అన్ని రకాల కార్టన్ బాక్సులపై జీఎస్టీ 12 శాతానికి కుదించడం ద్వారా ఆపిల్, ఇతర పండ్ల వ్యాపారులకు మేలు జరగనుంది.

స్ప్రింకర్లు, సోలార్ కుక్కర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.

జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 73 నిబంధన కింద విధించే జరిమానాలపై ప్రధానంగా చర్చించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు