TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th APRIL 2024

1) ఇంటిలిజెన్స్ అతివల అందాలను ఏ సంస్థ తొలిసారిగా నిర్వహిస్తుంది.?
జ : ఫన్ వే

2) పారిస్ ఒలింపిక్స్ 2024 జ్యోతి ని ప్రజ్వలన చేసినది ఎవరు.?
జ : గ్రీక్ నటి మరియా మినా

3) పారిస్ ఒలింపిక్స్ 2024 జ్యోతి ని ప్రజ్వలన అనంతరం మొదటగా ఎవరికి అందించారు.?
జ : స్టెఫనోస్ డూస్కస్ (రోయింగ్ ఆటగాడు)

4) ఐపీఎల్ లో 100 వికెట్లు, సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు ఎవరు.?
జ : సునీల్ నరైన్

5) డిస్కస్ త్రో లో 74.35 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన లిథ్వెనియా ఆటగాడు ఎవరు.?
జ : మికొలాస అలెక్‌నా

6) 2023 సంవత్సరానికి అంతర్జాతీయంగా మొత్తం విమాన ప్రయాణికుల సంఖ్య ఎంతకు చేరింది.?
జ : 850 కోట్లు

7) OECD అంచనాల ప్రకారం 2024లో భారత జిడిపి వృద్ధిరేటు ఎంత.?
జ : 6.1 శాతం

8) స్వయం సహాయక సంఘాల నుండి లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : కర్ణాటక

9) IMF అంచనాల ప్రకారం 2024లో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు అని పేర్కొంది.?
జ : 6.8% (గతంలో 6.5%)

10) 2023 – 24 లో భారతదేశం నుంచి ఎన్ని కోట్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి.?
జ : లక్ష కోట్లు

11) లాన్సెట్ నివేదిక ప్రకారం 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కారణంగా ఎంత మంది మరణించనున్నారు.?
జ : 10 లక్షలు

12) లాన్సెట్ నివేదిక ప్రకారం 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కారణంగా ఎంత మంది మరణించారు.?
జ : 6,85,000

13) ఒలంపిక్స్ కు మూడుసార్లు ఆతిధ్యం ఇచ్చిన నగరాలు ఏవి.?
జ : లండన్ మరియు పారిస్