Home > EMPLOYEES NEWS > ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ – సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (MARCH 15) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు (three men committee on employees and Teachers issues) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఇచ్చిన సమస్యల పరిష్కారానికి ఈ త్రిసభ్య కమిటీ తోడ్పడుతుందని పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీకి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షులు గా, ప్రొఫెసర్ కోదండరాం, ఐఏఎస్ దివ్య సభ్యులుగా ఏర్పాటు చేయనున్నారు.

ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, తదనగుణంగా నివేదిక అందించాలని కమిటీకి రేవంత్ రెడ్డి సూచించారు.