DAILY G.K. BITS IN TELUGU MARCH 16th
1) తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ప్రవాస భారతీయుల అసోసియేషన్ స్థాపించిన సంస్థ ఏది.?
జ : తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం
2) కాకతీయుల కాలంలో కిళీరము అనే పన్ను దేనిపై విధించారు.?
జ : గొర్రెల మందపై
3) పోలియో వ్యాధి నిరోధానికి తొలిసారి సమర్థవంతమైన టీకాను రూపొందించినది ఎవరు?
జ : జోనస్ ఇ సల్క్
4) ఆధునిక మొబైల్ ఫోన్స్ వైర్ లెస్ చార్జింగ్ వివరించే సూత్రము ఏది?
జ : ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం
5) హైదరాబాద్ రాష్ట్రంలో రాజ భూములుగా పేర్కొనే నిజాం కుటుంబానికి చెందిన వాటిని ఏమని వ్యవహరిస్తారు.?
జ : సర్ప్ ఈ ఖాస్
6) ఉత్తర తెలంగాణ వ్యవసాయక వాతావరణం మండలం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ స్థాపించబడింది.?
జ : జగిత్యాల
7) తెలంగాణలో నూనె గింజల నుండి నూనె తీసే సామాజిక వర్గాన్ని ఏమని పిలుస్తారు.?
జ : గాండ్ల
8) మొగిలిచర్ల తామ్ర శాసనం ఏ రాజ వంశ పాలన గూర్చిన చారిత్రక సమాచారం అందజేస్తుంది.?
జ : ముదిగొండ చాళుక్యులు
9) నాగసముద్రమనే చెరువును ఎవరు నిర్మించారు.?
జ : నాగాంబిక
10) కీసర రామలింగేశ్వర దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది.?
జ : విష్ణు కుండీనులు
11) పంజాబ్ కేసరిగా పేరుగాంచిన అతివాద నాయకుడు ఎవరు?
జ : లాలా లజపతిరాయ్
12) హిందువుల అణగారిన వర్గాల తరఫున 24 సెప్టెంబర్ 1932 నాడు కుదిరిన పూనా ఒడంబడికపై సంతకం చేసిన ముఖ్య ప్రతినిధులు ఎవరు?
జ : మహాత్మా గాంధీ & బిఆర్ అంబేద్కర్
13)మిద్దె రాములు ఏ రంగంలో ప్రసిద్ధులు.?
జ : ఒగ్గు కథ
14) హైదరాబాద్ నగరంలో “దారుల్ సిఫా” ఆసుపత్రిని నిర్మించిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు.?
జ : మహమ్మద్ కులీ కుతుబ్ షా
15) 1952 ముల్కీ పోరాటంలో ప్రధానమైన నినాదం ఏది?
జ : ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్