హైదరాబాద్ (ఎప్రిల్ – 27) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 4,006 Trained Graduate Teacher (TGT) ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను జారీ చేసింది.
తెలంగాణ రెసిడెన్షియల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలో గల టీజీటీ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
★ ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీలు : 4,006
తెలుగు – 488
సంస్కృతం – 25
హిందీ – 516
ఉర్ధూ – 120
ఇంగ్లీష్ – 681
గణితం – 741
బయోలాజికల్ సైన్స్ – 327
ఫిజికల్ సైన్స్ – 431
జనరల్ సైన్స్ – 98
సోషల్ స్టడీస్ – 579
◆ దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 28 నుండి మే 27 సాయంత్రం 5 గంటల వరకు
◆ దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)
◆ వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)
◆ అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ 50% మార్కులతో (SC, ST, BC, PH లకు 45% మార్కులు) మరియు బీఈడీ చేసి ఉండాలి. TS TET, APTET, CTET అర్హత సాదించి ఉండాలి.
◆ పరీక్ష విధానం : మొత్తం 3 పేపర్లు 300 మార్కులకు ఉండనున్నాయి.
పేపర్ – 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు
పేపర్ – 2 : సంబంధించిన సబ్జెక్టు పెడగాగి – 100 మార్కులు
పేపర్ – 3 : సంబంధించిన సబ్జెక్టు స్థాయిలో – 100 మార్కులు
◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.