మహబూబాబాద్ జిల్లా TGJLA నూతన కమిటీ ఏర్పాటు

మహబూబాబాద్ (సెప్టెంబర్ – 03) : తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA, 475) మహబూబాబాద్ జిల్లా నూతన అధ్యక్షులుగా వేముల రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డాక్టర్ శ్రీ కొప్పిశెట్టి సురేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ లు స్థానిక ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ సమక్షంలో ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ గారికి శాలువ పూల బొకేతో సన్మానించారు.

ఈరోజు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో TGLA కేంద్ర నాయకత్వం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నూతన కమీటిని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా వేముల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా డి. రవి కిరణ్, కోశాధికారిగా సుశీల, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోకె రాజేష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా తోట నాగేశ్వరరావు, మహిళా కార్యదర్శిగా సునీత, ప్రచార కార్యదర్శిగా డాక్టర్ ఉష్కమల శ్రీనివాస్, తదితర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డాక్టర్ శ్రీ కొప్పిశెట్టి సురేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ లు మాట్లాడుతూ… ప్రభుత్వ కళాశాల బలోపేతానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని దానిలో భాగంగానే కాంట్రాక్టు లెక్చరర్స్ అందరిని రెగ్యులర్ చేశారని… జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి, జిల్లా కమిటీ నాయకులు గోడుగు సోమన్న, అడపాల ప్రసాద్ రావు, శ్రీనివాస్, సరిత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.