TGJLA 475 కేలండర్ ఆవిష్కరణ

వరంగల్ (జనవరి – 29) : వరంగల్ జిల్లా “తెలంగాణా గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ -TGJLA_475 నూతన సంవత్సరం – 2024 గోడ పత్రికను (TGJLA 475 CALENDAR) ఈరోజు సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కోదాటి శ్రీధర్ గారి ఆధ్యర్యంలో కళాశాలలో ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం లో గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వ విద్య బలోపేతానికి సంఘపరంగా అందిస్తున్న సేవలను కొనియాడారు. అదేవిదంగా జిల్లా లో ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలనీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ కౌన్సిలర్ మామిండ్ల బుచ్చిరెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాత్రి నాగరాజు,vఅనిల్ కుమార్, పవన్ కుమార్, కుమారస్వామి, యాక సాయిలు, కుమారస్వామి, అక్రమ్ అలీ, మరియు సోదర సంఘ మిత్రులు పాల్గొన్నారు.