తెలంగాణ ఉద్యోగులకు DA పెంపు

హైదరాబాద్ (జూన్ – 19) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ను 2.73శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం డీఏ అందించింది.

ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తాజాగా డీఏ ను 2.73శాతం పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయగా.. మొత్తంగా 22.75శాతం డీఏ ఉద్యోగులకు అందుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు.

జూన్ నెల వేతనంతో పెంచిన డీఏ అందనుండగా.. 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.