DSC NOTIFICATION 2023 : జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

హైదరాబాద్ (ఆగస్టు – 25) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లో 6612 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారానే ఈ పోస్టులను వర్తించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. పాఠశాల విద్యలో 5,089 మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు1,523 కలవు.

జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్ గా, జిల్లా విద్యాధికారి సెక్రటరీగా, జిల్లా పరిషత్ సీఈవో సభ్యులుగా గల కమిటీ ఈ నియామకాలను చేపట్టనుంది.

DSC NOTIFICATION ఖాళీలు

స్కూల్ అసిస్టెంట్ (SA)- 1,739
సెకండరీ గ్రేడ్ టీచర్లు – 2’575
భాష పండితులు – 621
పీఈటీలు – 164
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రాథమిక పాఠశాలలో – 796 ప్రాథమికోన్నత పాఠశాలలు – 727

తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 1,22,386 టీచర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 1,03,343 టీచర్లు పనిచేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 1,947 స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా, 2,162 టీచర్లకు పీఎస్ హెచ్‌ఎంగా, మరో 5,870 సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు స్కూల్ అసిస్టెంట్స్ పదోన్నతులు కల్పించాల్సి ఉందని చెప్పారు. ఇవిపోనూ ఖాళీగా ఉన్న 6,612 పోస్టులను ప్రత్యక్షంగా భర్తీ చేస్తున్నట్టు తెలిపారు.