DSC NOTIFICATION : పరీక్ష విధానం & మార్గదర్శకాలు

హైదరాబాద్ (ఆగస్టు – 26) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,612 టీచర్ ఉద్యోగాలను పాఠశాల విద్య మరియు ప్రత్యేక అవసరాల పిల్లల విద్య లో భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. (Telangana DSC 2023 notification exam pattern and guidelines.)

ఈ నేపథ్యంలో పాఠశాల 5,089 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవోను జారీ చేసింది. అలాగే 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యలో పోస్టులను త్వరలో ఆర్థిక శాఖ ఆమోదం తెలపనుంది. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీ విధానం మరియు మార్గదర్శకాలను విడుదల చేసింది.

★ పరీక్ష విధానం

80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. దీనికోసం 160 ప్రశ్నలను ఇవ్వనున్నారు. ప్రశ్నకు అర మార్కు చొప్పున కేటాయించారు.

20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజ్ గా ఇవ్వనున్నారు.

ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో ఏ పద్దతిలో నిర్వహించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

★ DSC మార్గదర్శకాలు

గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా, ఈ నిబంధనను తాజాగా ఎత్తివేస్తున్నారు. రోస్టర్ ప్రకారం అంతా పోటీపడొచ్చు.

గతంలో 6 శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్ తాజాగా 10 శాతానికి పెంచుతున్నారు.

గతంలో లోకల్, ఓపెన్ కోటా రిజర్వేషన్ 80 : 20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95 : 5 రేషియోలో అమలుచేస్తారు.

అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4-10 తరగతులు చదువును పరిగణలోకి తీసుకోగా, తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకొంటారు.

◆ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు