ముంబై (ఎప్రిల్ – 07) : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య సమీక్ష విధానంలో రేపో రేటును 6.5% గా యధాతధంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దానితోపాటు కొన్ని నిర్ణయాలను తీసుకుంది అవి…
ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 5.2 శాతంగా నమోదు కావచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందని అంచనా.
వృద్ధి అంచనాలపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల ఒడిదుడుకుల ప్రభావం
పశువుల దాణా ఖర్చులు, అధిక డిమాండ్ తో ఈ వేసవిలో పాల ధరలు పెరిగే అవకాశాలు
యూపీఐ సేవల పరిధిని మరింత పెంచే దిశగా అడుగులు
బ్యాంకుల్లోని అనెక్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను డిపాజిటర్లు లేదా వారి సంబంధీకులు తెలుసుకునేలా 3-4 నెలల్లో ఓ సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్ అందుబాటులోకి
భారత్ సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా, యూరప్ బ్యాంకింగ్ సంక్షోభం ప్రభావం.
మూలధన నిల్వ లపై దృష్టి పెట్టాలని దేశీయ బ్యాంకులకు హితవు.
జూన్ 6-8 తేదీల్లో రెండో ద్వైమాసిక సమీక్ష.