Quinton De Kock : ఈ వరల్డ్ కప్ లో నాలుగో సెంచరీ

పూణే (నవంబర్ – 01) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా సౌతాప్రికా, న్యూజిలాండ్ (SAvsNZ) జట్ల మద్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో సౌతాప్రికా ఓపెనర్ Quinton De Kock తన భీకర ఫామ్ ను కొనసాగిస్తూ ఈ ప్రపంచ కప్ లో 4వ సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఒకే వరల్డ్ కప్ లో నాలుగు సెంచరీలు చేసిన కుమార సంగకర్ర రికార్డును సమం చేశాడు.

ఓవరాల్ గా అంతర్జాతీయ వన్డే లలో క్వింటన్ డికాక్ కు ఇది 21వ సెంచరీ. హసీమ్ ఆమ్లా 27, డివిలియర్స్ – 25 సెంచరీలతో డికాక్ కంటే ఎక్కువ సెంచరీలు కలిగి ఉన్న దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ లు.

ఒకే వరల్డ్ కప్ లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో రోహిత్ శర్మ ముందు ఉన్నాడు. 2019 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ 5 సెంచరీలు నమోదు చేశాడు.

క్వింటన్ డీకాక్ ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో, ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు (174) మరియు అత్యధిక సెంచరీల (4) జాబితాలో ముందున్నాడు.