హైదరాబాద్ (డిసెంబర్ – 07) : తెలంగాణ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగాఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి TSPSC ప్రకటన ఇచ్చింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 19 సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న 247 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
◆ దరఖాస్తు గడువు : డిసెంబర్ 14 నుంచి జనవరి 04 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
◆ వయోపరిమితి : 18 – 44 సం. ల మద్య ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
◆ పరీక్ష తేదీ : మే, జూన్ – 2023
◆ విద్యా అర్హతలు :
- లెవల్ 9A పోస్టులకు మొదటి శ్రేణి లో బీఈ, బీటెక్, బీఆర్క్, బీఎస్, బీఫార్మాసి. సంబంధించిన సబ్జెక్టులో బాచిలర్ డిగ్రీ,
- లెవల్ 10 పోస్టులకు మొదటి శ్రేణి లో ఎంఎస్, ఎంఫార్మాసి, ఎంఈ, ఎంటెక్, సంబంధించిన సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ
◆ దరఖాస్తు ఫీజు : 200/- + 120/-
◆ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, హన్మకొండ
◆ వేతనం : 56,100/- & 57,700/-
◆ పరీక్ష విధానం : రెండు పేపర్లతో నిర్వహించబడును. పేపర్ – 1, 150 మార్కులకు (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ ) పేపర్ – 2, 150 మార్కులకు (సంబంధించిన సబ్జెక్ట్) ప్రతి పేపర్
◆ పూర్తి నోటిఫికేషన్ : download pdf file
◆ వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/